Nithiin-Venky Kudumula movie | హిట్టయిన కాంబోలో మరో సినిమా వస్తుందంటే అందరూ అమితాసక్తితో ఎదురు చూస్తుంటారు. ఈ సారి మరెన్ని రికార్డులు కొల్లగొడుతారో.. బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో కలెక్షన్ల వరద పారిస్తారో అని ఇప్పటినుంచే ఫలానా అంచనాలు వేస్తుంటారు. ప్రస్తుతం అదే క్రేజ్ ఉన్న కాంబో నితిన్-వెంకీ కుడుముల కాంబో. మూడేళ్ల క్రితం భీష్మ సినిమాతో కోట్లు కొల్లగొట్టిన ఈ కాంబో మరో సారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సారి కామెడీతో పాటు కాస్త అడ్వేంచర్ ను కూడా వెంకీ కుడుముల యాడ్ చేశాడట. అడ్వేంచర్ కోసం సరికొత్త లోకేషన్ల వేటను షురూ చేశారట. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీతో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. తన సొంత బ్యానర్ అయిన శ్రేష్ఠ్ మూవీస్ సంస్థలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నితిన్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్లో సినిమాను రిలీజ్ చేయాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ప్