Robinhood | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో తాజాగా మీడియాతో చిట్ చాట్ సెషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ మీట్లో ఒక రిపోర్టర్ నితిన్‌ను అడుగుతూ.. పెద్ద హీరో అయ్యుండి పాన్ ఇండియా సినిమా ఎందుకు చెయ్యట్లేదు అంటూ ప్రశ్న వేస్తాడు.
దీనికి నితిన్ సమాధానమిస్తూ.. అది రాసి పెట్టి ఉండాలి అండి. డెస్టినీ అనుకుంటే తప్పక అవుతుంది. అప్పటివరకు వెయిట్ చేద్దాం. ముందే ప్లాన్ చేస్తే అది సెట్ అవ్వదు. పాన్ ఇండియా వైడ్‌గా ఆడే కథ రావాలి. దాన్ని తెరకెక్కించే దర్శకుడు దొరకాలి అన్ని కుదరాలి అంటూ నితిన్ చెప్పుకోచ్చాడు. రాబిన్ హుడ్ సినిమా విషయానికి వస్తే.. నితిన్ ఇందులో దొంగ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. వెన్నెల కిషోర్, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.