Robinhood | వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ నితిన్ (Nithiin) నటిస్తోన్న సినిమా రాబిన్‌హుడ్ (Robinhood). లేడీ బాస్ ల్యాండింగ్ అవుతున్నట్టు తెలిపిన మేకర్స్.. ఇంతకీ ఆ లేడీ బాస్ ఎవరనేది సస్పెన్స్‌లో పెట్టారు. ముందుగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం ఆ లేడీ బాస్ ఎవరో క్లారిటీ ఇచ్చారు. ఆ భామ ఎవరో కాదు శ్రీలీల (Sreeleela). ఈ బ్యూటీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. శ్రీలీల స్టైలిష్ అవతార్‌లో హ్యాండ్ బ్యాగ్ వేసుకుని విమానంలో నుంచి దిగుతున్న స్టిల్‌ను షేర్ చేశారు.
ఈ లుక్ ఇప్పడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే రాబిన్‌హుడ్ గ్లింప్స్ వీడియోలో డబ్బు చాలా చెడ్డది.. రూపాయి రూపాయి నువ్వేం చేస్తావే అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతానంటది. అన్నట్టే చేసింది.. దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ముళ్లు. ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు… అంటూ సాగుతున్న డైలాగ్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.
ఈ మూవీలో నితిన్ దొంగగా సరికొత్త అవతారంలో కనిపించబోతుండగా.. నటకిరిటీ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మి్స్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Weight – Thelidu. Headweight – ∞.
The lady boss is here ✨
Happy Birthday @sreeleela14 aka ‘Neera Vasudev’ from the adventurous world of #Robinhood ❤️🔥
In cinemas from December 20th, 2024.@actor_nithiin @VenkyKudumula @gvprakash pic.twitter.com/ffGLOni74p
— Mythri Movie Makers (@MythriOfficial) June 14, 2024
రాబిన్‌హుడ్ టైటిల్ గ్లింప్స్..