Nithiin | చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న యువ హీరోల్లో ఒకడు నితిన్. 2020లో వచ్చిన భీష్మ తర్వాత నితిన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలు ఊహించని విధంగా బోల్తా కొట్టాయి. నితిన్ స్క్రిప్టుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నా ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో వెనకబడుతున్నాయి.
నితిన్ ఇప్పటికే ఇష్క్ ఫేం విక్రమ్ కే కుమార్‌తో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసిందే. స్వారీ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రానికిసంబంధించి కొత్త అప్డేట్ రావాల్సి ఉంది. అయితే నితిన్ ఇప్పుడు లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయిమార్తాండ్తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడన్న వార్త ఒకటి ఇండస్ట్రీ సర్కిల్ లో హల్ చల్ చేస్తోంది.
సాయిమార్తాండ్ రీసెంట్గా నితిన్‌ను కలిసి కామెడీ డ్రామా నేపథ్యంలో సాగే ఓ కథను చెప్పాడట. స్క్రిప్ట్‌లోని కథ, కథనం బాగా నచ్చడంతో ఇంప్రెస్ అయిన నితిన్ పాజిటివ్‌గా స్పందించినట్టు ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే రాబోయే రోజుల్లో నితిన్-సాయి మార్తాండ్ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు అర్థమవుతుంది.
ఇక ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన లిటిల్ హార్ట్స్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.40 కోట్లు వసూళ్లు చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఇలాంటి జోనర్‌లోనే నితిన్‌తో సినిమా రాబోతుందన్న వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Srinidhi Shetty | సిద్ధు పాత్రతో ప్రేమలో పడిపోతారు.. తెలుసు కదా సినిమాపై శ్రీనిధి శెట్టి
Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం వెబ్‌సిరీస్ జోనర్ ఇదేనట..!