Nithiin Next Movie | నితిన్ హిట్టు చూసి ఏళ్లు గడిచింది. మూడేళ్ల కిందట వచ్చిన భీష్మ తర్వాత ఇప్పటి వరకు మరో హిట్టు చూడలేదు. చెక్, రంగ్‌దే, మ్యాస్ట్రో ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు వచ్చి పడ్డాయి. ఇక ఎంత కష్టపడి చేసిన మాచర్ల సైతం తొలిరోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుని వారంలోపే బిస్తరు కట్టేసింది. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఆశలన్నీ వక్కంతం వంశీ సినిమాపైనే ఉన్నాయి. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు , పాటలు గట్రా సినిమాపై మంచి బజ్నే క్రియేట్ చేశాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా నితిన్ తన కొత్త సినిమాను ప్రారంభించాడు.
ఎమ్సీఏ, వకీల్‌సాబ్ సినిమాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వేణు శ్రీరామ్‌తో నితిన్ తన తదుపరి సినిమా చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ సినిమాను శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా అయిన తమ్ముడు టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. దీనితో పాటుగా నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.
ఇక వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరామ్ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ఆ మధ్యలో అల్లు అర్జున్‌తో ఐకాన్ అంటూ ప్రకటించినా.. అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత అదే కథను రామ్ పోతినేనితో చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినా.. అది కుదరలేదు. కాగా ఇప్పుడదే కథతో నితిన్‌ను మెప్పించాడని ఇన్సైడ్ టాక్. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
DIL RAJU – NITHIIN – SRIRAM VENU COLLABORATE FOR NEW FILM… #Nithiin teams up with producer #DilRaju and director #SriramVenu [who directed #VakeelSaab, starring #PawanKalyan] for a new #Telugu film, titled #Thammudu.#Thammudu was launched with a pooja ceremony today… Shoot… pic.twitter.com/QyTDXMo9TL
— taran adarsh (@taran_adarsh) August 27, 2023