Macherla Niyojakavargam Third single | ఫలితంతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు నితిన్. గతేడాది ఏకంగా మూడు సినిమాలతో సందడి చేశాడు. అందులో ‘రంగ్‌దే’ విజయం సాధించగా ‘చెక్’ ఫ్లాప్‌గా మిగిలింది. ఇక ‘మ్యాస్ట్రో’ నేరుగా ఓటీటీలో విడుదలై మంచి వ్యూవర్ షిప్‌ను సాధించింది. ప్రస్తుతం నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదలకు సిద్ధంగా ఉంది. రొటీన్‌కు భిన్నంగా నితిన్ ఈ సారి పొలిటికల్ థ్రిల్లర్ కథతో రానున్నాడు. ప్రముఖ ఎడిటర్ ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ అప్డేట్లను షురూ చేసారు. తాజాగా చిత్రబృందం మరో అప్డేట్ను ప్రకటించింది.
ఈ చిత్రంలోని ‘అదిరిందే’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను జూలై 23న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘రా రా రెడ్డి’ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ ఈ చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌గా కనిపించనున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆదిత్య మూవీస్ &ఎంటర్టైనమెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్లపై ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో నితిన్ మొదటి సారిగా పూర్తి యాక్షన్ సినిమాలో నటించాడు.
July 23rd a lovely cool melody from Macherla Niyojakavargam coming ur wayy ❤️❤️ pic.twitter.com/fIm6TFnQX5
— nithiin (@actor_nithiin) July 21, 2022