Nithiin | జయం, దిల్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుని చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగాడు నితిన్. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలన్ని ఫ్లాప్ అవ్వడం.. మళ్లీ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తాడా అని చూస్తుంటే.. దాదాపు ఏడేళ్ల స్ట్రగుల్ తర్వాత ‘ఇష్క్’ సినిమాతో తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈ కుర్ర హీరో కెరీర్ మంచి స్పీడ్ అందుకుంది. ఆ వెంటనే ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్లు కావడంతో నితిన్ మార్కెట్ కూడా అమాంతం పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ రెండు ఫ్లాపులు వచ్చిన ‘అఆ!’తో తిరిగి హిట్ ట్రాక్ ఎక్కేశాడు. అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే భారీ విజయం సాధించడంతో నితిన్‌పై ప్రేక్షకుల్లో ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి.
అయితే తనను మళ్లీ ఫాంలోకి తీసుకువచ్చిన ఇష్క్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు నితిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. శనివారం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా చూడడానికి సుదర్శన్ థియేటర్‌కు వచ్చిన నితిన్.. సినిమా చూస్తూ అభిమానులతో కలిసి చిందులు వేశాడు. ఈ సినిమాలోని పాటలకు నితిన్ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Thanks for coming @actor_nithiin anna 😍
Hope you enjoyed a lot ❤️❤️#Ishq4K pic.twitter.com/XzapAXAZ5p
— Daya Arjun (@DayaArjun2) November 30, 2024