Extra Ordinary Man | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోంది. నితిన్ క్లాస్, స్టైలిష్, మాస్ లుక్‌లో డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నాడు. అరే నువ్వొక జూనియర్ ఆర్టిస్ట్‌వి.. అంటే ఎక్స్ట్రాగాడివి.. ఒక ఆర్డినరీగాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు.. అంటూ కొడుకు క్యారెక్టరైజేషన్ గురించి రావు రమేశ్ చెప్తున్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.
ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తు్నాడు. ఇటీవలే టీంలోకి రాజశేఖర్ వెల్కమ్ చెబుతూ.. క్యారవాన్‌లో నుంచి దిగుతున్న వీడియోను షేర్ చేయగా నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లో నితిన్ స్మగ్లర్‌గా కనిపించనున్నట్టు ఇన్సైడ్ టాక్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ లాంఛ్ చేసిన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
నితిన్ ఈ చిత్రంతోపాటు వెంకీ కుడుముల డైరెక్షన్లో VNRTrio (వర్కింగ్ టైటిల్)లో కూడా నటిస్తున్నాడు. భీష్మ తర్వాత నితిన్, కన్నడ భామ రష్మిక మందన్నా, వెంకీ కుడుముల కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పై నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. VNRTrio చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన నితిన్ గుబురు గడ్డంతో ఉన్న ఫస్ట్ లుక్ సినిమాపై హైప్ పెంచుతోంది.
ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ టీజర్..
డేంజర్ పిల్లా లిరికల్ వీడియో సాంగ్..
డేంజర్ పిల్లా లిరికల్ ప్రోమో..