శ్రీకాంత్ గుర్రం, హేమలత జంటగా నటిస్తున్న సినిమా ‘నిన్నే చూస్తు’. సుమన్, సుహాసినీ, భానుచందర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై హేమలతా రెడ్డి నిర్మిస్తున్నారు. కె.గోవర్థనరావు దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
ఈ సందర్భంగా నిర్మాత హేమలత రెడ్డి మాట్లాడుతూ..‘ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఓడిపోదు అనే కాన్సెప్ట్‌తో సినిమాను నిర్మించాం. కుటుంబ సమస్యలు ప్రేమకు అడ్డుకావని చెప్పబోతున్నాం. కుటుంబ కథా చిత్రమిది. కోవిడ్ కారణంగా విడుదల ఆలస్యమైంది. ప్రస్తుతం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’ అన్నారు.