Nimrat Kaur | ఇటీవల కాలంలో నిమ్రత్ కౌర్ పేరు తెగ వినిపిస్తున్నది. అభిషేక్ బచ్చన్ తన భార్య ఐశ్వర్య రాయ్ నుంచి విడిపోతున్నారని.. త్వరలోనే నిమ్రత్ కౌర్‌ని పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నట్లు బాలీవుడ్లో టాక్ నడుస్తున్నది. అయితే, తాజాగా నిమ్రత్ కౌర్‌ను ప్రశంసిస్తూ అమితాబ్ బచ్చన్ తన దస్తూరితో రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మనం కలుసుకున్నది, మాట్లాడుకున్నది చాలా తక్కువ. క్యాడబరీ యాడ్ కోసం యష్‌రాజ్ ఫిల్మ్స్‌లో నిన్ను కలిసిన సమయంలో కాంప్లిమెంట్ ఇచ్చినట్టు ఉన్నాను. అయితే, దస్వీలో నీ నటన అత్యద్భుతం. నీ హావభావాలు, నటన, అన్నీ బాగున్నాయి.
నీకు నా ప్రత్యేక అభినందనలు’ అమితాబ్ బచ్చన్ లేఖ రాశారు. ఈ ప్రశంసలపై నిమ్రత్ కౌర్ స్పందించింది. ‘18 సంవత్సరాల కిందట ముంబయిలో సెట్లోకి తొలిసారి అడుగుపెట్టాడు. అప్పుడే అమితాబ్ బచ్చన్ గారికి ఓ రోజు నా పేరు తెలుస్తుంది. ఆయన్ని నేను కలవాలని కోరుకున్నాను. ఓ యాడ్ షూట్లో కలిసి నటించిన తర్వాత ఆయన ప్రశంసించారు. కొన్నేళ్ల తర్వాత ఇలా నోట్, ఫ్లవర్స్ పంపడం నా కెరీర్లో మరిచిపోలేని సందర్భం. నా కల నెరవేరినట్టుగా ఉంది. మీరు చూపించిన ఆదరణకు ఎలా ధన్యవాదాలు తెలుపుకోవాలో అర్థం కావడం లేదు. మీ ఉత్తరం నన్ను ప్రతిక్షణం, అనునిత్యం స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది. మీకు పంపిన బొకే పరిమళం, నా జీవితంలో ప్రతీ అడుగులోనూ గుభాళిస్తుంది’ అంటూ నిమ్రత్ కౌర్ సోషల్ మీడియా వేదికగా స్పందించింది.
ఇదిలా ఉండగా.. అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్ 2022లో ‘దస్వీ’ మూవీలో నటించారు. యామి గౌతమ్ ప్రధానపాత్రలో నటించిన ఈ మూవీ ఓటీటీలో విడుదలైంది. ఇందులో అభిషేక్ బచ్చన్, నిమ్రత్ కౌర్ కీలకపాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా.. గతకొంతకాలంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ విడాకులు తీసుకోనున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని వార్తలు వస్తున్నాయి. పలు కార్యక్రమాలకు అభిషేక్ బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్య రాయ్ కలిసి రాకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి.