Swayambhu | కొత్తదనంతో కూడిన కంటెంట్‌తో సినిమాలు చేసే హీరోల్లో టాప్‌లో ఉంటాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil). ఈ యంగ్ యాక్టర్ కాంపౌండ్ నుంచి వస్తోన్న తొలి పాన్ ఇండియా సినిమా స్వయంభు (SWAYAMBHU). Nikhil 20గా వస్తోన్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ సంయుక్తామీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన స్వయంభు ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
చాలా రోజుల తర్వాత షూటింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాలో షూటింగ్ కొనసాగుతోంది. నిఖిల్‌తోపాటు ఇతర నటీనటులపై వచ్చే కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ షెడ్యూల్లో షూట్ చేస్తున్నారని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం. విజువల్‌గా అద్భుతమైన అనుభూతి కలిగించేలా మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ ఉండబోతుండగా.. రవి బస్రూర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి.
స్వయంభు చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తుండగా.. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. స్వయంభు పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్.. కాగా కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నాడు. స్వయంభులో నిఖిల్ యుద్ధ వీరుడిగా ఇదివరకెన్నడూ కనిపించని సర్ప్రైజింగ్ లుక్‌లో మెరువబోతున్నాడు.
#Swayambhu begins a new schedule in the forests of Maredumilli 💥
The team will shoot key sequences in the challenging terrains with @actor_Nikhil in this schedule ❤️🔥@iamsamyuktha_ @NabhaNatesh @krishbharat20 @RaviBasrur @DOPSenthilKumar @TagoreMadhu @bhuvan_sagar… pic.twitter.com/yLVbF1tBxB
— BA Raju’s Team (@baraju_SuperHit) June 26, 2024