టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం 18 పేజెస్ (18 Pages). ఈ చిత్రాన్ని పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేస్తున్నాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న గ్రాండ్గా థియేటర్లలో విడుదలయేందుకు రెడీ అవుతోంది.
ఈ సినిమా పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్ కు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం 18 పేజెస్ పోస్ట్ థ్రియాట్రికల్ రైట్స్ ను నెట్ఫ్లిక్స్, ఆహా సొంతం చేసుకోగా.. శాటిలైట్ రైట్స్ ను జీ ఛానల్ దక్కించుకుంది. ఈ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. ఎంత మొత్తం అనేది నిఖిల్ టీం క్లారిటీ రావాల్సి ఉంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి శింబు పాడిన టైం ఇవ్వు పిల్లా సాంగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. మిగిలిన రెండు పాటలకు కూడా మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 18 పేజెస్ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్త నిర్మాణంలో బన్నీవాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 18 పేజెస్ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథనందిస్తున్నాడు.