నిఖిల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ-2’. చందు మొండేటి దర్శకుడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. శ్రీకృష్ణుడి నేపథ్య ఇతివృత్తంతో సోషియా ఫాంటసీ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదలైంది. అబ్బురపరిచే విజువల్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంది. ‘ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం.. ప్రమాదం లిఖితం..పరిష్కారం లిఖితం, ఏ ప్రశ్న అయినా నా దగ్గరకు రానంత వరకే.. వస్తే అది సమస్య కాదు..సమాధానం’ అనే సంభాషణలు ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. ద్వారకా నగరం తాలూకు ఓ రహస్యాన్ని ఛేదించే డాక్టర్ కార్తికేయ పాత్రలో హీరో నిఖిల్ కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, అనుపమ్‌ఖేర్, శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్, ఆదిత్యామీనన్, తులసి, సత్య, వైవా హర్ష, వెంకట్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాలభైరవ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.