నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘స్పై’. ఐశ్వర్య మీనన్ నాయికగా నటిస్తున్నది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎడ్ ఎంటర్టైన్మెంట్స్పై చరణ్ తేజ్ ఉప్పలపాటి సీఈవోగా కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని పోరాట ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ లీ విటేకర్ ఈ యాక్షన్ సన్నివేశాల్ని రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ ఏడాది దసరా పండక్కి విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా నిఖిల్ను కొత్తగా చూపిస్తుందని, అతని క్యారెక్టర్ ఆకట్టుకుంటుందని, యాక్షన్ సీక్వెన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం చెబుతున్నారు. అభినవ్ గోమటం, సన్యా ఠాకూర్, జిషుసేన్ గుప్తా, నితిన్ మెహతా తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జూలియన్ ఎస్ట్రాడా, సంగీతం : శ్రీచరణ్ పాకాల.