Nikhil Siddartha | కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో నిఖిల్ ముందు వరుసలో ఉంటాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో వెండి తెరకు పరిచయమైన నిఖిల్ మొదటి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అటు తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొన్నాడు. ఇక ‘స్వామి రారా’ చిత్రంతో తన కెరీర్ ములుపు తిప్పింది. అంతే కాకుండా నిఖిల్ కథలను ఎంపిక చేసుకునే విధానం పూర్తిగా మారిపోయింది. ‘కార్తికేయ’, ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడ’, ‘అర్జున్ సురవరం’ వంటి కంటెంట్ సినిమాలతో మంచి విజయాలను సాధించి ప్రేక్షకులలో విపరీతమైన క్రేజ్‌ను ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం ఈయన నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.
అందులో నిఖిల్ హీరోగా గారీ దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుంది. గతేడాదే ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను నిఖిల్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. అయితే ఇప్పటివరకు ఈ చిత్రంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన బిగ్ అప్డేట్ను మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం ఉదయం 11.11 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. గన్స్, బుల్లెట్లు, రూట్ మ్యాప్‌లు ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. ఈడీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం నిఖిల్ నటించిన ‘కార్తికేయ-2′, ’18 పేజీస్’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Tomorrow 11:11 am it will be RAINING BULLETS…
Our 19th film Title and First Look Tomorrow…
The Target is Locked 🔒@actor_nikhil @Ishmenon @Garrybh88 @tej_uppalapati @julian_amaru #Edentertainments #kRajashekarreddy #Nikhil19 pic.twitter.com/kUT6nxNKn0— Nikhil Siddhartha (@actor_Nikhil) April 16, 2022