శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Apr 08, 2020 , 10:57:56

నిఖిల్ పెళ్ళి ఏప్రిల్ 17న‌.. క‌న్‌ఫాం చేసిన ఆయ‌న తండ్రి

నిఖిల్ పెళ్ళి ఏప్రిల్ 17న‌.. క‌న్‌ఫాం చేసిన ఆయ‌న తండ్రి

మంగ‌ళ‌వారం రోజు నిఖిల్ పెళ్ళి వాయిదా అని, మ‌ళ్ళి ఇప్పుడు ఏప్రిల్ 17న పెళ్లి అనే స‌రికి కాస్త అవాక్క‌యింటారు క‌దా.. మీరు విన్న‌ది చూసింది నిజ‌మే. ఏప్రిల్ 16న జ‌ర‌గాల్సిన టాలీవుడ్ హీరో నిఖిల్ పెళ్ళి వాయిదా ప‌డింది. క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార స్వామి త‌న‌యుడు నిఖిల్ గౌడ పెళ్ళి ఏప్రిల్ 17న జ‌రుగుతుంద‌ని ఆయ‌న తండ్రి కుమార‌స్వామి పేర్కొన్నారు.

నిఖిల్ పొలిటీషియ‌న్‌గానే కాకుండా న‌టుడిగాను ఇటు తెలుగు అటు క‌న్న‌డ ప్రేక్ష‌కుల‌ని అల‌రించాడు.జాగ్వార్ చిత్రంతో ఆయ‌న తెరంగేట్రం చేశాడు. ఇటీవ‌ల ఆయ‌న‌కి రేవతితో సంబంధం కుద‌ర‌గా, రామనగర జానదలోక వద్ద భారీ ఏర్పాట్లతో వివాహం జ‌ర‌పాల‌ని ఫ్యామిలీ ప్లాన్ చేసింది.  ల‌క్ష మంది జ‌నం మ‌ధ్య రామ‌న‌గ‌ర‌లోని జాన‌ద‌లోక వ‌ద్ద భారీ ఏర్పాట్ల‌తో వివాహం జ‌ర‌పాల‌ని కుమార‌స్వామి భావించాడు. కాని క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో పెళ్ళి వాయిదా ప‌డుతుంద‌ని అంద‌రు అనుకున్నారు.

కాని ఏప్రిల్ 17న నిఖిల్ పెళ్ళి జ‌రుగుతుంది. కాక‌పోతే అంగరంగ వైభవంగా కాదని మాజీ సీఎం. హెచ్‌.డి.కుమారస్వామి అన్నారు. వధూవరుల కుటుంబాల నుంచి కేవలం 15–20 మంది మాత్రం హాజరవుతారు.  బెంగళూరులోని మా ఇంటిలోనే పెళ్లి జరుగుతుంది అని తెలిపారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo