Niidhhi agerwal | సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. సినిమాలకు సంబంధించిన అప్డేట్స్తో పాటు, తన గ్లామరస్ ఫోటోషూట్స్‌తో తరచూ నెట్టింట్లో హల్చల్ చేస్తూ ఉంటుంది. అంతేకాక, అభిమానులతో చిట్‌చాట్ చేసి ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేయడంలోనూ నిధి ముందుంటుంది. తాజాగా, ప్రతి రోజు రాత్రి తానే చేసే ఒక ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది. రాత్రి సమయంలో నాకు ఒక మర్డర్ మిస్టరీ సినిమా లేదా వెబ్ సిరీస్ చూడడం అలవాటుగా మారింది. కానీ ఇప్పుడు కొత్త కంటెంట్ దొరకడం లేదు. దయచేసి నాకు మంచి మర్డర్ మిస్టరీలు సజెస్ట్ చేయండి. ఏ భాష అయినా సరే! అని నిధి తన ట్వీట్ ద్వారా ఫ్యాన్స్‌ను కోరింది.
నిధి ట్వీట్ కు నెటిజన్ల నుంచి ఆశించినంత రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. కానీ చాలా మంది కాస్త సెటైరిక్ మూడ్‌లోనే ఆమెకి రిప్లై ఇచ్చారు. రాధే శ్యామ్, బ్రహ్మోత్సవం,ఆచార్య , అజ్ఞాతవాసి సినిమాలు మర్డర్ మిస్టరీలే అంటూ కామెంట్ చేశారు. ఇక “హరి హర వీరమల్లు” సినిమా ఇప్పటివరకు విడుదల కాకపోవడం కూడా మర్డర్ మిస్టరీ అయిపోయిందని ఓ అభిమాని ఫన్నీగా స్పందించాడు. మరికొందరు “ఆదిపురుష్”, “ఫ్యామిలీ స్టార్”, “శక్తి”, “స్పైడర్”, “వరుడు”, “భోళా శంకర్” వంటి సినిమాల పేర్లను మర్డర్ మిస్టరీలు అంటూ సజెస్ట్ చేశారు.
ఇక మేఘాలయ హనీమూన్ కేసు, తేజేశ్వర్ మర్డర్ కేసులాంటివి అసలైన మర్డర్ మిస్టరీలని, వాటి గురించి తెలుసుకోమంటూ కొందరు సలహాల ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. అలానే రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ది రాజా సాబ్ సినిమాల్లో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్నాయి.హరి హర వీరమల్లు సినిమా జూలై 24, 2025న విడుదలకు సిద్ధమవుతుండగా, ది రాజా సాబ్ మూవీ డిసెంబర్ 5, 2025న థియేటర్లలోకి రానుంది. ఈ రెండు సినిమాల తర్వాత తన కెరీర్ మరో మలుపు తిరుగుతుందన్న ఆశాభావం నిధిలో కనిపిస్తోంది.