Niharika| దాదాపు డజను మంది హీరోలున్న మెగా కాంపౌండ్ నుంచి సోలో హీరోయిన్గా వచ్చిన అందాల ముద్దుగుమ్మ నిహారిక. యాంకర్‌గా పరిచయమై ఆ తర్వాత హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఒక మనసు చిత్రంతో హీరోయిన్గా మారిన నిహారిక ఆ తర్వాత పలు సినిమాలు చేయగా, ఏ ఒక్క సినిమా కూడా మంచి ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో నిహారిక హీరోయిన్ గా కాకుండా నిర్మాణ రంగం వైపు వేసి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్‌గా నిలిచారు. మంచి కంటెంట్‌తో , తక్కువ బడ్జెట్‌తో సినిమాలు చేస్తూ హిట్లు కొడుతూ విమర్శల ప్రశంసలు దక్కించుకుంటుంది.
నిహారిక ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచి, మ్యాడ్ హౌస్ , ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హాలో వరల్డ్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్‌లు నిర్మించి మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకుంది. ఇక గత ఏడాది కమిటీ కుర్రోళ్లు అనే సినిమాను నిర్మించారు. రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 25 కోట్లు రాబట్టి తొలి ప్రయత్నంలోనే నిహారిక నిర్మాతగా మంచి సక్సెస్ దక్కేలా చేసింది. ఇక ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను నిర్మిస్తున్నారు నిహారిక కొణిదెల. ఇక ఈ అమ్మడు నిర్మాతగా రాణిస్తూనే హీరోయిన్‌గాను మంచి హిట్ కోసం ప్రయత్నిస్తుంది. మలయాళ మూవీ మద్రాస్ కారన్‌లో నిహారిక హీరోయిన్గా నటించగా, ఈ చిత్రానికి వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహించారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్న నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకి సంబంధించిన విషయాలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో రిజల్ట్ ఆఫ్ గ్రేస్ క్లాస్..థ్యాంక్యూ అంటూ శరన్ జిత్ కౌర్‌ని ట్యాగ్ చేసింది. అలానే తన కాళ్లపై మచ్చలతో ఉన్న పిక్ కూడా షేర్ చేసింది. అంటే నాట్యం నేర్చుకునే క్రమంలో నిహారిక గజ్జలు కట్టుకోవడం వలన తన పాదాలు ఇలా అయినట్టు నిహారిక తన పోస్ట్ ద్వారా వెల్లడించినట్టు అర్ధమవుతుంది. ఈ పిక్ చూసిన నెటిజన్స్ జాగ్రత్త, టేక్ కేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.