Niharika | మెగా డాటర్ ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. యాంకర్‌గా అదరగొట్టిన నిహారిక ఆ తర్వాత నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.కొణిదెల నిహారిక 2015 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోంది. ఒక మనసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నర్సింహ రెడ్డి, డార్లింగ్, వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ అమ్మడు నటించిన ఏ చిత్రం కూడా బ్లాక్ బాస్టర్ హిట్స్ ను అందుకోలేకపోయింది. మరోవైపు పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. డెడ్ పిక్సెల్స్, బెంచ్ లైఫ్ వంటి సిరీస్ ల్లో నటించిన కూడా సక్సెస్ అందుకోలేకపోయింది
ఇక నిర్మాతగా తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమైన ఈ ముద్దుగుమ్మ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మించిన కమిటీ కుర్రాళ్లు చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. రూ.10 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి రూ.25 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యింది. ఇక తెలుగులో మనోజ్ నటిస్తోన్న ”వాట్ ది ఫిష్” అనే సినిమాలో నిహారిక హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నిహారికకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. నిహారిక సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుందని, త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనుందంటూ ప్రచారం ఊపందుకుంది.
నిహారిక కొణిదెల తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఒక ఫొటో ప్రస్తుతం అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫొటో చూస్తుంటే ఏదో శుభకార్యం, పూజ లేదా నిశ్చితార్థం వంటి వేడుకకు సంబంధించినదిగా కనిపిస్తోంది.ఈ ఫొటోలో నిహారిక పట్టుచీర ధరించి సంప్రదాయబద్ధంగా కనిపించారు. ఆ ఫొటో చూస్తే నిహారిక నిశ్చితార్థం చేసుకున్నదనే చర్చ నడుస్తోంది. పూర్తి ఫొటో పోస్టు చేయకుండా కేవలం చేయి.. పూలు కనిపించేలా షేర్ చేసి నెటిజన్ల మెదడుకు పదును పెట్టింది. అది కచ్చితంగా నిశ్చితార్థం ఫొటో అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం పిక్ నెట్టింట వైరల్ అవుతుంది. అలానే నిహారిక నిశ్చితార్థం న్యూస్ కూడా వైరల్‌గా మారింది.