Tom Cruise | ప్రముఖ హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను యూట్యూబర్, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నిహారిక కలుసుకుంది. టామ్ క్రూజ్ నటించిన తాజా చిత్రం “మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకానింగ్” (Mission: Impossible – The Final Reckoning) వరల్డ్ ప్రీమియర్ షో లండన్‌లో ఇటీవల జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిహారిక, టమ్ క్రూజ్‌తో కలిసి ముచ్చటించడంతో పాటు అతడితో కలిసి ఫొటోలు దిగింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ విషయాన్ని నిహారిక తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. టామ్ క్రూజ్‌తో ఉన్న వీడియోను షేర్ చేస్తూ ఆమె భావోద్వేగపూరితమైన వ్యాఖ్యలు చేశారు. “ఈ మిషన్ సాధ్యమవ్వడంతో నా ఆత్మ పరవశించిపోయింది. దీని నుంచి తేరుకోవడానికి నాకు ఒక శతాబ్దం పడుతుంది. టామ్ క్రూజ్ సర్ మీరు ఎంతో గొప్ప వ్యక్తి నేను కలలో కూడా ఊహించని ఈ కల నిజమయ్యేలా చేసినందుకు ధన్యవాదాలంటూ ఆమె రాసుకోచ్చారు. కాగా, “మిషన్: ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకానింగ్” చిత్రం నేడు వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిషన్: ఇంపాజిబుల్ సిరీస్‌లో వస్తున్న చివరి చిత్రమిది. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో 8 చిత్రాలు వచ్చాయి.
సోషల్ మీడియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక ఇప్పుడు నటిగానూ రాణిస్తున్నారు. ఇన్ఫ్లూయెన్సర్గా ఎంతో మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న ఆమె, ఇటీవలే విడుదలైన ‘పెరుసు’ చిత్రంలో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి స్పందన లభిస్తోంది.
#NiharikaNM found her Prince Charming at the #MissionImpossible London premiere… and yes, it’s TOM CRUISE!@JustNiharikaNm living every girl’s dream!
Mission Accomplished✨❤️She’s gearing up for a few exciting projects in Telugu soon! pic.twitter.com/iiAjeIpG7g
— Teju PRO (@Teju_PRO) May 16, 2025