Niharika| మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు యాంకర్‌గా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత హీరోయిన్గా పలు సినిమాలు చేసింది.అయితే నిహారికకి ఒక్క సినిమా కూడా మంచి హిట్ అందించలేకపోయింది. ఇక నటిగా మంచి గుర్తింపు రావడం లేదని భావించిన నిహారిక నిర్మాతగా సినిమాలు చేయడం ప్రారంభించింది. ఈ మధ్య కమిటీ కుర్రాళ్లు అనే సినిమా చేయగా, ఈ మూవీ సూపర్ హిట్ అయింది. దీంతో ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా మరి సినిమాలను కూడా నిర్మించాలని నిహారిక భావిస్తుంది.
అయితే నిహారిక సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని వ్యక్తి అయిన జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే కుర్రాడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ పద్దతిలో చాలా అట్టహాసంగా జరిగింది. అయితే వీరి పైవాహిక జీవితం రెండేళ్లకే ముగిసిపోయిందని చెప్పాలి. పెళ్లైన రెండు సంవత్సరాలకి విడాకులు తీసుకుని ఎవరి దారులు వారు చూసుకున్నారు. విడాకుల ప్రకటన తర్వాత వీరి విడాకులకి కారణం ఏమై ఉంటుందా అని పలువురు పలు రకాల చర్చలు జరిపారు. అయితే విడాకులు తీసుకున్న అనంతరం నిహారిక తిరిగి సినిమా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతుంది. హీరోయిన్గా మంచి హిట్ కొట్టాలనే కసితో ఉంది.
తాజాగా నిహారిక తన విడాకులపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా, విడాకులు ఏ అమ్మాయికైన బాధాకరమైన అనుభవం అంటూ నిహారిక స్పష్టం చేసింది. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టేటప్పడు ఎవరు కూడా విడాకుల గురించి ఆలోచించరు. కొన్ని సార్లు కొన్ని పరిమాణాలు వేరుగా ఉండడం, పరిస్థితులు అదుపు తప్పడం వలన కష్టమైన నిర్ణయాలు తీసుకోవల్సి ఉంటుంది. జీవితంలో సవాళ్ల నుంచి చాలా నేర్చుకునేందుకు ఆస్కారం ఉందని నిహారిక పేర్కొంది. గతంలో చాలా సందర్భాల్లో విడాకుల గురించి స్పందించడానికి ఇష్టపడని నిహారిక ఇప్పుడు మాత్రం భిన్నంగా కామెంట్స్ చేసింది. ఇక నిహారిక వయస్సు 31 ఏళ్లు అని తెలుస్తుండగా, ఆమె త్వరలో రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంది.