వినోదరంగంలో పేరు పొందిన నైట్ షిప్ట్ స్టూడియోస్ తాజాగా మ్యూజిక్ ఇండస్ట్రీలోకి ప్రవేశించనుంది. ‘నైట్షిప్ట్ రికార్డ్స్’ పేరుతో ఆడియో కంపెనీని ఆరంభించింది. నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ వర్ధమాన సంగీత ప్రతిభకు వేదికగా నిలవడమే తమ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకులు, నిర్మాత రామచంద్ర చక్రవర్తి తెలిపారు. తమ సంస్థ నిర్మిస్తున్న మలయాళ చిత్రం ‘భ్రమయుగం’ ద్వారా ఈ పాటల ప్రయాణం ఆరంభమవుతుందని ఆయన తెలిపారు. అగ్ర హీరో మమ్ముట్టి నటిస్తున్న ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతాన్నందిస్తున్నారు.