Nidhi agarwal | అందాల భామ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నిధి, బాలీవుడ్ నుంచి వచ్చి అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకెళ్లింది. ముఖ్యంగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ హిట్ అందుకున్న నిధి అగర్వాల్, నటనతో పాటు గ్లామర్ పరంగానూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ, ఇటీవలి కాలంలో ఆమెకు ఆశించిన స్థాయిలో హిట్స్ మాత్రం పడలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో కీలక పాత్రలో కనిపించినప్పటికీ, ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
ఇప్పుడు నిధి ఆశలన్నీ ‘రాజా సాబ్’ సినిమాపైనే ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించగా, నిధి గ్లామర్ లుక్ మరోసారి హైలైట్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా, తాజాగా నిధి అగర్వాల్ తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోల్లో లవ్ సింబల్ పోజ్ ఇస్తూ కనిపించిన నిధి, అభిమానుల దృష్టిని వెంటనే ఆకర్షించింది. అయితే ఈ ఫోటోల్లో ఆమె చేతిపై పెన్నుతో ఏదో రాసి ఉండటం గమనించిన ఓ అభిమాని, “మీ చేతిలో ఏదో రాసి ఉంది… అది ఏంటో తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను” అంటూ కామెంట్ చేశాడు.
దీనికి నిధి కూడా చాలా సరదాగా స్పందించింది. “అయ్యో… మళ్లీ దొరికిపోయానా?” అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఈ క్యూట్ రెస్పాన్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. నిధి ఫోటోలతో పాటు ఆమె ఇచ్చిన ఈ సరదా రిప్లైపై అభిమానులు లైక్స్, కామెంట్స్‌తో సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండగా, నిధి అగర్వాల్ స్టైలిష్ లుక్, ఫన్ నేచర్ మరోసారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ‘రాజా సాబ్’తో నిధి మరోసారి హిట్ అందుకుంటుందా? అన్నది చూడాలి.