సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ముందు వరుసలో ఉంటుంది. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా అద్భుతం త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాలోని ఆమె పాత్రకు చెందిన స్పెషల్ పోస్టర్ని మేకర్స్ ఆదివారం విడుదల చేశారు.
ఈ పోస్టర్లో దేవుడ్ని ప్రార్థిస్తున్న నిధి అగర్వాల్‌ని చూడొచ్చు. కొద్ది రోజులక్రితం విడుదల చేసిన ‘ది రాజాసాబ్’ టీజర్లోనూ నిధి అగర్వాల్ సందడి చేశారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ అందంతోపాటు అభినయంతో కూడా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. సంజయ్‌దత్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ పళని, సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: టీజీ కృతిప్రసాద్, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల.