ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన నిధి అగర్వాల్ .. హిందీ సినిమా ‘మున్నామైఖెల్సతో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ‘సవ్యసాచి’తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో రామ్ హీరోగా వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఒకవైపు నటన, మరో వైపు తన అందాల ఆరబోతతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
17 ఆగష్టు 1993లో కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జన్మించిన నిధి అగర్వాల్ ఈ రోజు తన 27వ పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్‌కి సెలబ్రిటీలు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆమె నటిస్తున్నసినిమాలకు సంబంధించిన లుక్స్ కూడా విడుదల అవుతున్నాయి.
పళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, ఇందులో ఆమె పంచమి పాత్ర పోషిస్తుంది. తాజాగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయగా,ఇందులో నిధి అగర్వాల్ నర్తకిలా కనిపిస్తుంది. నిధి లుక్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. మరో వైపు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న సినిమాలోను నిధి నటిస్తుండగా, ఆ సినిమాలో లుక్ కూడా విడుదల చేశారు. ఈ రెండు సినిమాలలోని నిధి లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.