Nidhhi Agerwal | ‘రాజా సాబ్’ సినిమాతో ప్రేక్షకులను మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతోంది హీరోయిన్ నిధి అగర్వాల్. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో ముగ్గురు హీరోయిన్లలో ఒకరిగా నిధి నటించింది. 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా నిధి అగర్వాల్ ఎక్స్ (ట్విటర్) వేదికగా అభిమానులతో ముచ్చటించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల పవన్ కల్యాణ్ సరసన ‘హరి హర వీరమల్లు’ చిత్రంలో నటించిన నిధి, ఇప్పుడు ప్రభాస్‌తో ‘రాజా సాబ్’లో కనిపించనుంది. ఆదివారం (డిసెంబర్ 28) సాయంత్రం ఎక్స్‌లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సరదాగా సమాధానాలు ఇస్తూ, తన మనసులోని కోరికలను కూడా బయటపెట్టింది.
ఈ సందర్భంగా ఓ అభిమాని ‘‘తెలుగులో మీ డ్రీమ్ మల్టీస్టారర్ కాంబినేషన్ ఏది?’’ అని అడగ్గా, నిధి స్పందిస్తూ ‘‘పవన్ కల్యాణ్ సర్, ప్రభాస్ సర్, నేను.. డైరెక్షన్ సందీప్ రెడ్డి వంగా (SRV)’’ అంటూ సమాధానం ఇచ్చింది. ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులతో సరదాగా మాట్లాడిన నిధి, బ్రేక్‌ఫాస్ట్ డేట్ ప్రశ్నకూ ఆసక్తికరంగా స్పందించింది. ‘‘ఇడ్లీ కోసం పూర్ణ టిఫిన్ సెంటర్‌కు ఎప్పుడు వెళ్తారు?’’ అన్న ప్రశ్నకు ‘‘రేపు? బ్రేక్‌ఫాస్ట్ డేట్’’ అంటూ రిప్లై ఇచ్చింది. మరో అభిమాని డిన్నర్‌కు తీసుకెళ్తే ఎలా ఉంటుందని అడగ్గా, ‘‘ఎప్పుడు వెళ్దామనుకుంటున్నారు? ప్లాన్ చేయండి’’ అంటూ నవ్వులు పూయించింది.
ఇదిలా ఉండగా, ప్రభాస్ సినిమాలపై తన అభిప్రాయాన్ని కూడా నిధి వెల్లడించింది. ‘‘ప్రభాస్ మూవీస్‌లో మీకు ఎక్కువగా నచ్చిన సినిమా ఏది?’’ అని అడిగిన ప్రశ్నకు ఆమె ‘సలార్’ అని సమాధానమిచ్చింది. అలాగే ప్రభాస్‌ను ‘‘ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్’’గా పేర్కొన్న నిధి .. పవన్ కల్యాణ్, ప్రభాస్ ఇద్దరూ తమ అభిమానులను అమితంగా ప్రేమిస్తారని ప్రశంసించింది. నిధి అగర్వాల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి, అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచుతున్నాయి.