Nidhhi Agerwal | ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన భామలు ఇప్పుడు ఫేడ్ ఔట్ అయ్యారు. శ్రీలీలనే కాస్త నెట్టుకుంటూ వస్తుంది. ఫ్లాపులు వస్తున్నా కూడా వరుస అవకాశాలు దక్కించుకోవడం విశేషం. అయితే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలు అందరు కూడా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్పైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. ఈ బ్యూటీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రంతో పాటు ప్రభాస్ రాజా సాబ్ చిత్రంలో నటిస్తుంది. ఈ రెండింట్లో ఒక్క సినిమా హిట్ అయిన నిధి కెరీర్ గ్రాఫ్ మరింత పెరగడం ఖాయంగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే నిధి ఖాతాలో మరో టాలీవుడ్ ప్రాజెక్ట్ చేరినట్టు తెలుస్తుంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఓ సినిమాను చేయబోతున్నవిషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో రానున్న సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనైతే రాలేదు కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు అయితే శరవేగంగా సాగుతున్నాయి. ఈ సినిమాకు వెంకట రమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్ ను అనుకుంటున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు సమాచారం. మరో హీరోయిన్గా త్రిష ఉంటుందని టాక్ నడుస్తుంది. త్వరలో సినిమాను మొదలుపెట్టి 2026 సమ్మర్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్‌గా తెలుస్తుంది. వెంకీ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులని అలరించే విధంగా ఉంటుందని అంటున్నారు.
నిధి అగర్వాల్ ‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాతో ఎప్పుడు అలరిస్తూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్న నిధి అగర్వాల్ . 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆ తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. అయితే నిధికి సరైన బ్రేక్ రాలేదన్న మాట నిజమే. కానీ ఆమె చేతిలో ఉన్న ప్రస్తుత ప్రాజెక్ట్స్ చూస్తుంటే, ఈ ఏడాది ఆమెకు టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నటన, అందం, ఫిజిక్ అన్ని ఉన్నా… అదృష్టం ఎప్పుడు వరిస్తుంది అన్నదే ప్రశ్న. అయితే ఈ ఏడాది నిధికి గుడ్ టైం స్టార్ట్ అయ్యిందన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.