Hyderabad City Police | నూతన సంవత్సర వేడుకల్లో ఆర్భాటాలకు పోకుండా, మానవత్వమే మిన్న అని చాటిచెప్పారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్. జనవరి 1వ తేదీన ఆయన అత్యంత వినూత్నంగా, సేవా కార్యక్రమాలతో తన ఏడాదిని ప్రారంభించారు. కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఆయన, అక్కడి వృద్ధులతో సమయాన్ని గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, వారితో కలిసి కొత్త ఏడాది వేడుకలను జరుపుకున్నారు.
అనంతరం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సీనియర్ నటి పావలా శ్యామల గారిని పరామర్శించి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో ఉన్న ఆమెకు అండగా నిలిచిన పోలీస్ అధికారులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను, తన అనుభూతులను సీపీ సజ్జనార్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో షేర్ చేశారు. వృద్ధాశ్రమాలు లేని సమాజం రావాలని, తల్లిదండ్రులను భారంగా కాకుండా బాధ్యతగా చూసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
నూతన సంవత్సర వేడుకలంటే కేవలం సంబరాలు, హంగులే కాదు.. ఆత్మీయతను పంచుకోవడం, బాధ్యతను గుర్తుచేసుకోవడం. ఇదే సంకల్పంతో ఈ ఏడాది తొలి రోజును నిరాడంబరంగా, సేవా దృక్పథంతో ప్రారంభించాను.
సహచర పోలీసు అధికారులతో కలిసి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించడం, అక్కడి 48 మంది… pic.twitter.com/C0s4KcmBDh
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) January 1, 2026