ఆ అనుభవం బాగా నచ్చింది.. మనసులో మాట బయటపెట్టిన సోనాక్షి సిన్హా
Sonakshi sinha | లాక్డౌన్ ఎంతోమందికి కొత్త అనుభవాలను పరిచయం చేసింది. ముఖ్యంగా సినిమా రంగానికి చెందినవారికైతే, కుటుంబంతో గడిపేందుకు ఎంతో సమయాన్ని ఇచ్చింది. తనకు కూడా కరోనా కాలం అనేక కొత్త దారులను చూపిందని చెబుతున్నది బాలీవుడ్ ( Bollywood ) నటి సోనాక్షి సిన్హా.

ఓటీటీ ( OTT ) లకు ప్రజల్లో క్రేజ్ పెరిగింది. చిన్నాపెద్దా సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌నూ ఆసక్తిగా చూస్తున్నారు. అందుకే, నాకు వచ్చిన ఓటీటీ ( OTT ) అవకాశాన్ని కాదనలేకపోయాను. వెబ్ సిరీస్‌లో నటిస్తుంటే, ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నట్లు అనిపిస్తున్నది. కాబట్టే, డైరెక్టర్లు కథ చెప్పగానే ఒప్పుకొన్నా. ఈ కొత్తరకం అనుభవం బాగా నచ్చింది. అలాగే కొంగొత్త విషయాలను తెలుసుకుంటున్నా. పెద్ద సినిమా కానంత మాత్రాన, సిరీస్‌ను తక్కువ చేయడం సరికాదు.
ట్విట్టర్‌కు దూరం కావడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటున్నది. మొదట్లో సోషల్ మీడియా ఎక్స్‌పీరియెన్స్ చాలా బాగుండేది. ఒకరి పనిని ఒకరు అభినందించడంతో, కొత్తకొత్త పరిచయాలతో సరదాగా అనిపించేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదు. పైగా ఆ వలయం నుంచి బయటికి రావడంవల్ల నా పనికి ఎలాంటి ఇబ్బందీ ఉండటం లేదు. బోలెడంత నెగెటివిటీని వదిలించుకున్నా.
‘హౌజ్ ఆఫ్ క్రియేటివిటీ’ పేరుతో ఆర్ట్ వెంచర్ మొదలుపెట్టడం సంతోషంగా ఉంది. ప్రపంచానికి దూరంగా ఉండాలని మనసుకు అనిపించినప్పుడల్లా, అక్కడికెళ్లి పెయింటింగ్స్ వేస్తున్నాను. ఆర్ట్ రూమ్‌లో ఎక్కడపడితే అక్కడ నా బొమ్మలే ఉంటాయి. నన్ను అందరూ నటిగానే చూస్తారు, నిజానికి పెయింటింగ్స్ లేని సోనాక్షి తలలేని కోడితో సమానం.
నేను వేసిన బొమ్మలు అవతలి వాళ్లకు నచ్చడం, వెంటనే కొనేయడం చాలా ఆనందాన్ని ఇస్తున్నది. మొదటి పెయింటింగ్ అమ్మినప్పుడు గర్వంగా ఫీలయ్యాను. లాక్డౌన్లో వేసినవన్నీ వేలానికి పెట్టాను. ఆ డబ్బు చారిటీకి ఇచ్చాను.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Sonakshi: 22 ఏళ్ల వయస్సులో ఐదేళ్ల పాటు రిలేషన్..ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసిన సోనాక్షి
Sonakshi sinha | హీరోయిన్ అవుతానంటే నా స్నేహితులే అవమానించారు
చిరంజీవితో నటించడానికి ఆ హీరోయిన్ అంత డిమాండ్ చేసిందా..?
Samantha: ట్విట్టర్లో ఎస్ పేరుని తీసేసిన సమంత..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

