స్నేహితులే హేళన చేశారు!

శారీరక రూపాన్ని చూసి హేళన చేయడం (బాడీషేమింగ్) సమాజంలో ఓ రుగ్మతగా పాతుకుపోయిందని, మహిళలు ఆత్మవిశ్వాసంతో అలాంటి అవమానాల మీద పోరాటం చేయాలని పిలుపునిచ్చింది అగ్ర కథానాయిక సోనాక్షిసిన్హా. , కాలేజీ రోజుల్లో తాను అధిక బరువు సమస్యతో బాధపడ్డానని..లావుగా ఉన్నావంటూ దగ్గరి మిత్రులే కామెంట్స్ చేయడం బాధించేదని చెప్పింది. అయితే ఎంచుకున్న రంగంలో అగ్రగామిగా ఎదగాలనే సంకల్పంతో ప్రయాణాన్ని సాగించానని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘నేను ఫ్యాషన్ స్కూల్లో కోర్స్ చేస్తున్నప్పుడు కూడా నా శారీరక రూపాన్ని చూసి హేళన చేసేవారు. ఇంత లావు శరీరంతో కథానాయికగా ఎలా రాణిస్తావని అవమానంగా మాట్లాడేవారు. అయితే అలాంటి నెగెటివ్ మనస్తత్వం ఉన్న వారిని దూరం పెట్టాను. నాకు నచ్చినట్లుగా ఉంటూ సినీ ప్రయత్నాలు ప్రారంభించాను. కాస్త బొద్దుగా ఉండి కూడా సినీరంగంలో సత్తా చాటిన వారి జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకున్నా. నాడు విమర్శలు చేసిన వారే ఇప్పుడు నన్ను ఒక సెలబ్రిటీగా గౌరవిస్తున్నారు. అందుకే మహిళలు తమ రూపాన్ని చూసుకొని ఆత్మన్యూనతా భావానికి లోనుకావొద్దు’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Millet Snacks | చిరుధాన్యాలతో చేసినంత మాత్రాన చిరుతిళ్లు ఆరోగ్యకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
Jailbreak | ఎమర్జెన్సీ నాటకమాడి ఖైదీలు జైలు నుంచి ఎలా తప్పించుకున్నారంటే..!
Danger bells | తెలంగాణలో తరుముకొస్తున్న కరువు..! చుక్క నీరు లేక నెర్రెలు వాసిన ప్రాజెక్టులు, చెయ్యిచ్చిన కాంగ్రెస్ : వీడియో
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

