Viral Video | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం పెద్ది. ఈ మూవీ బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. శ్రీరామనవమి సందర్భంగా మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో చరణ్ డైలాగ్స్‌తో పాటు ఆయన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ కేక పుట్టించాయి.ముఖ్యంగా గ్లింప్స్ చివర్లో రామ్ చరణ్ కొట్టిన సిక్స్ షాట్ మాత్రం హైలెట్ అని చెప్పాలి. రామ్ చరణ్ క్రీజ్ వదిలి ఫ్రంట్ పుట్ వచ్చి హ్యాండిల్ ను నేలకు కొట్టి మళ్లీ లేచి బంతిని బలంగా కొట్టడం గ్లింప్స్‌కి హైలైట్ అని చెప్పాలి. ఇది మెగా అభిమానులకి మంచి ఫీస్ట్‌గా మారింది.
అయితే ఈ షాట్ వీడియోకు రకరకాలుగా క్రియేటివ్ వీడియోస్ చేస్తూ షేర్ చేస్తున్నారు. . తాజాగా ఓ నెటిజన్ షేర్ చేసిన క్రియేటివ్ వీడియో అదిరిపోయింది. ప్రభాస్ బౌలింగ్‌లో రామ్ చరణ్ బ్యాటింగ్ చేయగా, దాన్ని పవన్ కళ్యాణ్ క్యాచ్ పట్టుకున్నట్టు చేసిన ఓ మీమ్ తెగ వైరల్ అవుతుంది. ముగ్గురు హీరోలు ఒకే ఫ్రేములో కనిపించే సరికి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని ఈ సినిమా డిజాస్టర్ అయింది.
ఇప్పుడు “పెద్ది” సినిమాపై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఫస్ట్ షాట్ పేరిట వచ్చిన గ్లింప్స్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. 2026 మార్చి 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.చిత్రంలో రామ్ చరణ్ మాస్ అవతార్‌లో కనిపించనున్నాడు. రంగస్థలం తర్వాత తిరిగి రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించిన సినిమా ఇదే కావడంతో మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి.