Netflix Upcoming Movies | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ దుమ్మురేపుతోంది. ఎంటర్టైనమెంట్ విషయంలో అసలు తగ్గేదేలే అంటూ వరుస ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తుంది. ఇప్పటికే భారీ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టిన నెట్‌ఫ్లిక్స్ సోమవారం సాయంత్రం ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు, వెబ్ సిరీస్‌లను ప్రకటించింది. ఇందులో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ప్రాజెక్ట్‌తో పాటు రానా దగ్గుబాటి, వెంకిమామ నటించిన రానా నాయుడు 2 తదితర ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇక నెట్‌ఫ్లిక్స్ నుంచి అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్‌లు ఒకసారి చూసుకుంటే..
వెబ్ సిరీస్‌లు
షారుఖ్ ఖాన్ కొడుకు బాలీవుడ్ ఎంట్రీ
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా వెబ్ సిరీస్ బా***డ్స్ ఆఫ్ బాలీవుడ్ (The Ba***ds of Bollywood). నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో షారుఖ్‌తో పాటు అతడి కూతురు సుహానా ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమా అనౌన్స్మెంట్ టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
రానా నాయుడు 2
టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) కాంబోలో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ (Netflix) వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu). అమెరికన్ హిట్ సిరీస్ రే డోనోవ్యాన్‌కు అడాప్షన్గా తెరకెక్కిన ఈ సిరీస్ తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలయ్యి మంచి రికార్డు వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిరీస్‌కు సీజన్ రాబోతున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా సిరీస్ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్.
అక్క
నటి కీర్తి సురేష్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కీర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ అక్క(AKKA). బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఇందులో కీలక పాత్రలో నటించబోతుంది. యష్ రాజ్ ఫిలిమ్స్, నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను వదిలింది. ఈ టీజర్ చూస్తుంటే.. కీర్తి ఇందులో లేడి డాన్ అక్కగా కనిపించబోతుంది. పెర్నూరుకు చెందిన ఒక అమ్మాయి అక్కలపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుందని అనే స్టోరీలైన్‌తో ఈ సినిమా రాబోతుంది.
సూపర్ సుబ్బు- సందీప్ కిషన్
Super Subbu | టాలీవుడ్ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా వస్తున్న తాజా వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. నరుడా డోనరుడా, టిల్లు స్క్వేర్ చిత్రాల దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బ్రహ్మనందం కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ని కూడా మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే.. సందీప్ కిషన్ ఇందులో సెక్స్ ఎడ్యుకేషన్ అధికారిగా కనిపించబోతున్నాడు. మాకిపూర్ అనే గ్రామంలో అక్కడి ప్రజలు విచ్చలవిడిగా పిల్లలను కంటూ ఉంటారు. అయితే వీరికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌తో పాటు సెక్స్ ఎడ్యుకేషన్ మీదా ఆవగాహన పెంచడానికి ప్రభుత్వం అతడిని నియమించినట్లు తెలుస్తుంది.
కోహ్రా సీజన్ 2
నెట్‌ఫ్లిక్స్ వేదికగా రాబోతున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోహ్రా, పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ సిరీస్ టీజర్‌ని కూడా మేకర్స్ తాజాగా వదిలారు. ఇప్పటికే సీజన్ 1 మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా రెండో సీజన్ కోసం ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఢిల్లీ క్రైమ్ సీజన్ 3
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన వెబ్ సిరీస్ ఢిల్లీ క్రైమ్ (Delhi Crime). ఇప్పటికే రెండు సీజన్లు రాగా.. ఇందులో డీసీపీ వర్థికా చతుర్వేదిగా పాత్రలో నటించిన షెఫాలీ షా (Shefali Shah) ప్రేక్షకులను కట్టి పడేశారు. తాజాగా దీనికి మూడో సీజన్ రాబోతుంది.
మండలా మర్డర్స్
క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న మరో వెబ్ సిరీస్ మండలా మర్డర్స్. బాలీవుడ్ నటి వాణి కపూర్, వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. గోపీ పుత్రన్ & మనన్ రావత్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. YRF ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను నిర్మిస్తుంది.
ది రాయల్స్
బ్రిటిష్ వెబ్ సిరీస్ ది క్రౌన్ చిత్రాన్ని ఆధారంగా చేసుకొని వస్తున్న వెబ్ సిరీస్ ది రాయల్స్(). షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ ఖట్టర్ కథానాయకుడిగా నటిస్తుండగా.. భూమి పెడ్నేకర్ హీరోయిన్గా నటిస్తుంది. రాజస్థాన్‌కి చెందిన రాజావంశీయుల కథతో ఈ వెబ్ సిరీస్ రాబోతుంది.
సినిమాలు
టెస్ట్
తమిళ నటులు మాధవన్, నయనతార, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం టెస్ట్. క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ కోచ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా టీజర్‌ను వదిలారు మేకర్స్.
జ్యుయెల్ థీఫ్- సైఫ్ అలీఖాన్
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సైఫ్ అలీఖాన్, పాతాల్ లోక్ హీరో జైదీప్ అహ్లవత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం జ్యుయెల్ థీఫ్. గోల్డ్ స్మగ్లింగ్ ఆధారంగా వస్తుంది ఈ చిత్రం.
టోస్టర్
బాలీవుడ్ కథానాయకుడు రాజ్‌కుమార్ రావ్, సన్యా మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం ‘టోస్టర్’ (Toaster). ఈ సినిమాకు వివేక్ దాస్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తూ.. ఇన్‌స్టా వేదికగా టీజర్‌ను పంచుకుంది నెట్‌ఫ్లిక్స్ సంస్థ.
ఇంకే ఇవే కాకుండా మాధవన్(ఆప్ జైసా కోయీ), సైఫ్ అలీఖాన్ కుమారుడు ఇబ్రహీం తొలి చిత్రం (నాదానియా) తదితర సినిమా అనౌన్స్మెంట్లను కూడా నెట్‌ఫ్లిక్స్ పంచుకుంది.