Netfilx | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సేవలలో అంతరాయం ఏర్పడింది. ఈ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. లాగిన్ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో చాలా మంది యూజర్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని గంటలుగా ఈ సమస్య కొనసాగుతోందని వార్తలు వచ్చాయి. అమెరికాలోని న్యూయార్క్, చికాగో,డలాస్,లాస్ ఏంజెలెస్ నగరాల్లో ఈ సేవల్లో అంతరాయం ఎక్కువగా ఉందని అక్కడి యూజర్లు తమ సమస్యలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లాగిన్ చేస్తున్న సమయంలో ఎర్రర్ మెసేజ్ వస్తోందని,ఖాతాలను ఓపెన్ చేయలేకపోతున్నామని వారు వాపోతున్నారు.
అయితే కొంత సమయం తర్వాత ప్రయత్నించండి అనే ఎర్రర్ స్క్రీన్ మీద కనిపిస్తుండగా, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ని కూడా షేర్ చేస్తున్నారు. మరి కొంత మందికి వేరే సమస్య వస్తుంది. తమకు చెందిన ప్రొఫైల్‌లో వీక్షించిన కంటెంట్ జాబితా వేరే ప్రొఫైల్‌లో కనబడుతోందని, ఇది ‘ప్రొఫైల్ మిస్‌మ్యాచ్’ సమస్యగా భావిస్తున్నామని వారు చెప్పుకొచ్చారు. ఈ సయస్యని అనేక మంది యూజర్స్ గుర్తించి కంపెనీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యని సాల్వ్ చేసేందుకు గాను నెట్‌ఫ్లిక్స్ సాంకేతిక బృందం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం.
ప్రపంచవ్యాప్తంగా 300 మిలియన్ల సబ్స్క్రైబర్లు నెట్‌ఫ్లిక్స్‌కి ఉంది. 2025 నాటికి నెట్‌ఫ్లిక్స్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న వినియోగదారుల సంఖ్య 300 మిలియన్లకు చేరడం గొప్ప విషయం. కేవలం అమెరికాలోనే 81 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.ఈ ఏడాది ధూం ధాం మూవీ ఇప్పటివరకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 12.4 మిలియన్ న్యూస్ ను దక్కించుకొని మొదటి స్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 మూవీ 9.4 మిలియన్ వ్యూస్ ను దక్కించుకొని ఈ సంవత్సరం అత్యధిక వ్యూస్ ను నెట్ ఫ్లిక్స్ లో దక్కించుకున్న సినిమాల లిస్టులో రెండవ స్థానంలో ఉంది. దేవా మూవీ 8.7 మిలియన్ వ్యూస్ తో మూడవ స్థానంలో కొనసాగుతుండగా, నడనియన్ మూవీ 8.2 మిలియన్ వ్యూస్ తో నెట్ ఫ్లిక్స్ లో 4 వ స్థానంలో కొనసాగుతుంది. ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీ 5.7 మిలియన్ వ్యూస్ తో 5 వ స్థానంలో కొనసాగుతుంది