కరోనా పుణ్యమా అని ఈ మధ్య కాలంలో ఓటీటీలకు బాగా అలవాటు పడిపోయారు సినీ అభిమానులు. ఒక ఫ్యామిలీ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలంటే తక్కువలో తక్కువ వెయ్యి అయినా ఖర్చవుతాయి. ఈ క్రమంలోనే అదే వెయ్యి పెట్టి ఓ ఓటీటీ ప్లాట్ఫార్మ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సంవత్సరం పాటు కుంటుంబమంతా కలిసి ఇంట్లోనే సినిమాలు చూడొచ్చు అనే ధోరణిలో ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా జనాలను అట్రాక్ చేయడానికి ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలతో సందడి చేస్తున్నారు. కాగా ఓటీటీ సంస్థలన్నిటిలో గత రెండు,మూడేళ్లగా అగ్రగామిగా చెలామణి అవుతుంది నెట్‌ఫ్లిక్స్.
అయితే తెలుగులో మాత్రం దీనికి డిమాండ్ తక్కువే. మనవాళ్లు నెట్‌ఫ్లిక్స్‌కు ఎక్కువగ ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌లో దాదాపు హిందీ, ఇంగ్లీష్ సినిమాలే రిలీజవుతుంటాయి. ఎప్పుడో అమావాస్య, పున్నమికి తెలుగు సినిమా రిలీవుతుంది. పైగా అన్ని ఓటీటీలతో పోల్చితే దీని ధర చాలా ఎక్కువ. దాంతో తెలుగులో దీనికి డిమాండ్ చాలా తక్కువ. అయితే తాజాగా ఈ సంస్థ తెలుగు ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేందుకు వరుసగా తెలుగు సినిమాలను ప్రకటించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 సినిమాల ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్నట్లు తెలిపింది.
ఇంత పెద్ద మొత్తంలో సినిమాలను అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా నెట్‌ఫ్లిక్స్ ట్రెండ్ అవుతుంది. స్టార్ సినిమాల నుండి మీడియం రేంజ్, చిన్న సినిమాల వరకు 16సినిమాలను అనౌన్స్ చేసింది. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
1. భోళా శంకర్
2. అమిగోస్
3. సందీప్ కిషన్ ‘బడ్డి’ మూవీ
4. దసరా
5. బుట్ట బొమ్మ
6. ధమాకా
7. కార్తికేయ8
8. వరుణ్ తేజ్ 12
9. టిల్లు స్క్వేర్
10. వైష్ణవ్ తేజ్ 4
11. ఎస్ఎస్ఎమ్బి28
12. విరూపాక్ష
13. నాగశౌర్య 24
14.మీటర్
15. 18పేజీస్
16. అనుష్క-నవీన్ పొలిశెట్టి మూవీ