Kaala Paani | ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో వన్ ఆఫ్ ది లీడింగ్ పొజిషన్లో ఉంది నెట్‌ఫ్లిక్స్ (Netflix). డిఫరెంట్ ఓరియెంటెడ్ కంటెంట్‌తో ఎల్లప్పుడూ ప్రేక్షకులకు అలరిస్తూ వస్తుంది. అయితే నెట్‌ఫ్లిక్స్ తాజాగా ఇండియన్ సిరీస్‌తో మళ్లీ ముందుకు వస్తుంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన గన్స్ & గులాబ్స్(Guns & Gulabs), ఢిల్లీ క్రైమ్ (Delhi Crime), సేక్రెడ్ గేమ్స్ (Sacred Games), లిటిల్ థింగ్స్ (Littile Things) లాంటి ఇండియన్ సిరీస్‌లు బాగా పాపులర్ అయ్యాయి. ఇదిలా ఉంటే నెట్‌ఫ్లిక్స్ ”కాలా పాని” అంటూ మరో కోత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు.
ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. దీనితో పాటు ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియో గమనిస్తే.. అండమాన్ నికోబార్ దీవులలోని సెల్యులార్ జైలు చుట్టూ ఈ స్టోరి ఉండనున్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ నటి మోనా సింగ్ (Mona Singh), అశుతోష్ గోవారికర్ (AShutosh Govarikar), అమీ వాఘ్, సుకాంత్ గోయెల్, వికాస్ కుమార్, అరుషి శర్మ, రాధిక మెహ్రోత్రా, చిన్మయ్ మాండ్లేకర్, పూర్ణిమ ఇంద్రజిత్ తదితరులు ఈ సిరీస్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Can you hear the islands calling you? 🌊
Get ready to dive into the mysteries of #KaalaPaani, premieres 18th October only on Netflix.#KaalaPaaniOnNetflix pic.twitter.com/Y7lFnrkppT— Netflix India (@NetflixIndia) September 20, 2023
పోషమ్ పా పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సిరీస్‌ను బిశ్వపతి సర్కార్, అమిత్ గోలాని, సందీప్ సాకేత్, నిమిషా మిశ్రా కలిసి సంయుక్తంగా నిర్మించారు సమీర్ సక్సేనా, అమిత్ గోలాని కలిసి దర్శకత్వం వహించారు.