Modern Masters : S.S RAjamouli | టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్టీఆర్ కథానాయకుడిగా వచ్చిన స్టూడెంట్ నం1 సినిమాతో మెగాఫోన్ పట్టిన ఇతను మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం అనంతరం ఎన్టీఆర్తోనే మళ్లీ సింహాద్రి అంటూ సినిమా తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. 2015లో వచ్చిన బాహుబలి సినిమాతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించింది. ఇక బాహుబలి 2 సినిమా అయితే ఏకంగా రూ.2000 కోట్ల వరకు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం అనంతరం ఆర్ఆర్ఆర్ వంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించారు.
ఇదిలావుంటే జక్కన్న సినీ జీవితంపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించింది. మాడర్న్ మాస్టర్స్ ఎస్.ఎస్ రాజమౌళి (Modern Masters: S.S. Rajamouli)పేరిటా ఈ డాక్యుమెంటరీ వస్తుండగా.. ఈ చిత్రాన్ని ఆగష్టు 02 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
One man. Numerous blockbusters. Endless ambition. What did it take for this legendary filmmaker to reach his peak? 🎥🎬
Modern Masters: S.S. Rajamouli, coming on 2 August, only on Netflix!#ModernMastersOnNetflix pic.twitter.com/RR9lg7qTTu— Netflix India (@NetflixIndia) July 6, 2024