స్వీయ దర్శకత్వంలో చిమటా రమేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను-కీర్తన’. లక్ష్మీ కుమారి నిర్మాత. రిషిత, మేఘన కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ నెల 30న విడుదలకానుంది. ఇటీవల ట్రైలర్, ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు చిమటా రమేష్‌బాబు మాట్లాడుతూ ‘మల్టీజోనర్ ఫిల్మ్‌గా తెరకెక్కించాం. అందమైన ప్రేమకథతో పాటు అన్ని కమర్షియల్ అంశాలుంటాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు. సంధ్య, రేణుప్రియ, జీవా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కె.రమణ, సంగీతం: ఎం.ఎల్.రాజా, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి, రచన-దర్శకత్వం: రమేష్‌బాబు.