స్వీయ దర్శకత్వంలో చిమటా రమేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా లక్ష్మీకుమారి నిర్మాత. రిషిత, మేఘన కథానాయికలు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సినిమాలో ‘కొంచెం కొంచెం గుడుగుడు గుంజం’ అనే ప్రత్యేక గీతాన్ని ఇటీవల సీనియర్ నటుడు మురళీమోహన్ విడుదల చేశారు. అందమైన ప్రేమకథా చిత్రమిదని, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు హైలైట్‌గా నిలుస్తాయని, యాక్షన్ ఘట్టాలు కూడా మెప్పిస్తాయని హీరో చిమటా రమేష్ బాబు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: కె.రమణ, సంగీతం: ఎం.ఎల్.రాజా, రచన-దర్శకత్వం: చిమటా రమేష్‌బాబు.