Nenu-Keerthana Movie | చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఏ) సమర్పణలో, చిమటా లక్ష్మీ కుమారి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది ఆగస్టు 30న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 99 రూపాయల రెంట్‌తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఓటీటీలోనూ అద్భుతమైన స్పందనను రాబడుతోంది. తక్కువ సమయంలోనే భారీ వ్యూస్ సాధించి సందడి చేస్తోంది.
‘నేను-కీర్తన’ మల్టీ జానర్ చిత్రంగా రూపొందింది. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, కామెడీ, హర్రర్ వంటి అన్ని ఎలిమెంట్స్‌ను కలగలిపి చిమటా రమేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. జానీ పాత్రలో రమేష్ బాబు నటన అందరి ప్రశంసలు అందుకుంది. అన్యాయాలను ఎదురించే, అపాయంలో ఉన్నవారికి సాయం చేసే యువకుడిగా జానీ పాత్రలో ఆయన మెప్పించారు. అయితే, ఒక సమస్య కారణంగా జానీ శత్రువులతో పోరాడాల్సి వస్తుంది. ఈ సమయంలో జానీ జీవితంలోకి కీర్తన ప్రవేశిస్తుంది. వీరి స్నేహం క్రమంగా ప్రేమగా మారుతుంది. కీర్తన ఒక ప్రమాదంలో చిక్కుకున్న విషయం తెలిసిన జానీ, ఆమెను ఎలా కాపాడాడనేది చిత్ర కథను ఆసక్తికరంగా మలిచింది.
కుల్లు మనాలిలో చిత్రీకరించిన పాటలు, యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. ఊహించని మలుపులతో కథను హర్రర్ జానర్ వైపు తీసుకెళ్లిన దర్శకుడు చిమటా రమేష్ బాబు ప్రతిభను చాటారు. హీరోయిన్లుగా రిషిత, మేఘన తమ నటనతో ఆకట్టుకున్నారు. రేణు ప్రియా, సంధ్య, జీవా, విజయ్ రంగరాజ్, జబర్ధస్త్ అప్పారావు, జబర్ధస్త్ సన్నీ, మంజునాథ్‌లు ఇతర పాత్రల్లో మెప్పించారు. ఈ చిత్రం IMDbలో 8.9, బుక్‌మైషోలో 9.3 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
చిత్ర వివరాలు:
చిత్రం: నేను-కీర్తన
నటీనటులు: చిమటా రమేష్ బాబు, రిషిత, మేఘన, రేణు ప్రియా, సంధ్య, జీవా, విజయ్ రంగరాజ్, జబర్ధస్త్ అప్పారావు, జబర్ధస్త్ సన్నీ, మంజునాథ్ తదితరులు
బ్యానర్: చిమటా ప్రొడక్షన్స్
సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఏ)
నిర్మాత: చిమటా లక్ష్మీ కుమారి
రచయిత, దర్శకుడు: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్)
ఫైట్స్: నూనే దేవరాజ్
సినిమాటోగ్రఫీ: కె రమణ
ఎడిటర్: వినయ్ రెడ్డి బండారపు
మ్యూజిక్: ఎం.ఎల్ రాజా
వి.ఎఫ్.ఎక్స్: ఎ.నవీన్