Nene Raju Nene Mantri| రానా తొలి సోలో హిట్ ‘నేనేరాజు నేనేమంత్రి’ కి నాలుగేళ్లు
తేజ (Teja) దర్శకత్వంలో రానా నటించిన చిత్రం నేనేరాజు నేనేమంత్రి (Nene Raju Nene Mantri). రానా కెరీర్ లో తొలి సోలో హిట్ గా నిలిచింది. ఈ మూవీ నేటికి నాలుగేళ్లు పూర్తి చేసుకుంది.

అప్పటి వరకు రానా దగ్గుబాటి (Rana Daggubati) సినిమాలు అంటే కేవలం విమర్శకుల ప్రశంసలకు మాత్రమే పనికొస్తాయనే పేరుంది. ఎందుకుంటే ఈయన నటించిన లీడర్, కృష్ణంవందే జగద్గురుమ్ లాంటి సినిమాలకు మంచి పేరు వచ్చింది కానీ హిట్ రాలేదు. సోలో హీరోగా ఒక్క హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నాడు రానా. అదే సమయంలో ఈయన విలన్ గా నటించిన బాహుబలి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. హీరోగా కాకుండా కారెక్టర్ ఆర్టిస్టుగానే రానా పనికొస్తాడనే కామెంట్స్ కూడా మొదలైపోయాయి. అలాంటి సమయంలో తేజ (Teja)కాంబినేషన్ లో ఈయన చేసిన సినిమా నేనేరాజు నేనేమంత్రి (Nene Raju Nene Mantri).
జయం తర్వాత అప్పటికి 15 ఏళ్లుగా విజయం లేని తేజ.. నేనేరాజు నేనేమంత్రితో సత్తా చూపించాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా విజయం సాధించింది. రానా కెరీర్ లో మొదటి సోలో హిట్ ఇదే. మంచి అంచనాలతో వచ్చిన నేనేరాజు నేనేమంత్రి ఆగస్ట్ 11, 2017న విడుదలైంది. అదే రోజు నితిన్ లై.. బెల్లంకొండ శ్రీనివాస్ జయ జానకి నాయకా సినిమాలతో పోటీ పడి మరీ విజయం సాధించింది. మరి నాలుగేళ్ళ కింద ఈ సినిమా వసూలు చేసిన మొత్తమెంతో చూద్దాం..
నైజాం: 8.50 కోట్లు
సీడెడ్: 2.70 కోట్లు
ఉత్తరాంధ్ర: 2.70 కోట్లు
ఈస్ట్: 1.88 కోట్లు
వెస్ట్: 1.00 కోట్లు
గుంటూరు: 1.55 కోట్లు
కృష్ణా: 1.49 కోట్లు
నెల్లూరు: 0.68 కోట్లు
ఏపీ + తెలంగాణ: 20.04 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 4.35 కోట్లు
వరల్డ్ వైడ్: 24.82 కోట్లు
ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రూ. 20 కోట్లకు అమ్మారు. రానా మార్కెట్ తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. కానీ భారీ అంచనాలతో వచ్చిన నేనేరాజు నేనేమంత్రి మంచి వసూళ్లనే సాధించింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో శివాజీ రాజా కీలక పాత్రలో నటించాడు. ఫుల్ రన్లో సినిమా దాదాపు రూ 25 కోట్లు షేర్ వసూలు చేసింది. రానా కెరీర్ లో తొలి సోలో విజయం ఇదే.
ఇవి కూడా చదవండి..
Nayanthara Engagement| ఎంగేజ్మెంట్ అయిపోందని చెప్పిన నయనతార
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
Mahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

