రిచర్డ్ రిషి హీరోగా నటిస్తున్న చిత్రం ‘ద్రౌపది-2’. మోహన్ జీ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సోల చక్రవర్తి నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో రక్షణ చంద్రచూడన్ నటిస్తున్నది. ఇటీవల విడుదల చేసిన ఆమె ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది.
తాజాగా ఈ సినిమా నుంచి ‘నెలరాజె..’ అనే పాటను విడుదల చేశారు. కాబోయే వరుడిని మనసులో ఊహించుకుంటూ అమ్మాయి పాడే గీతంగా తెరకెక్కించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ పాటను సామ్రాట్ రచించారు. మెలోడీ ప్రధానంగా ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. నట్టి నటరాజన్, వేల రామమూర్తి, చిరాగ్ జాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, దర్శకుడు: మోహన్.జి.