మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). శృతిహాసన్ (shruti haasan) ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఇటీవలే వైజాగ్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్‌తోపాటు మిగిలిన పాటలు, ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. కాగా ఇపుడు మరో సాంగ్ అప్డేట్ వచ్చింది.
ఈ చిత్రం నుంచి నీకేమో అందమెక్కువ అంటూ సాగే ఐదో పాటను జనవరి 11న ఉదయం 10:35 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశారు. మాస్ అవతార్‌లో ఉన్న చిరంజీవి చేతిలో గులాబీ పట్టుకుని శృతిహాసన్‌ను ఫాలో అవుతున్న లుక్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది.
బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.
A peppy melody in Veerayya's style 🥳🔥#WaltairVeerayya 5th single #NeekemoAndamekkuva on Jan 11 at 10.35 AM💥
Grand launch at Malla Reddy University, HYD 🔥
Megastar @KChiruTweets Mass Maharaja @RaviTeja_offl @dirbobby @shrutihaasan @ThisIsDSP @SonyMusicSouth pic.twitter.com/nIgImpNhaf
— Mythri Movie Makers (@MythriOfficial) January 10, 2023
వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ..
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..