మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య (Waltair Veerayya). బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ (shruti haasan) ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి నీకేమో అందమెక్కువ.. నాకేమో తొందరెక్కువా అంటూ సాగే పాటను లాంఛ్ చేశారు మేకర్స్.
చిరు, శృతిహాసన్ మధ్య సాగే ఈ డ్యుయెట్ ట్రాక్ మాస్ స్టైలిష్ టచ్‌తో కొత్తగా సాగుతూ మ్యూజిక్ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజిషన్‌లో మికా సింగ్, గీతామాధురి, డీ వెల్మురుగన్ పాడారు.
ఇప్పటికే విడుదలైన వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్, బాస్ పార్టీ సాంగ్‌తోపాటు మిగిలిన పాటలు, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. వాల్తేరు వీరయ్య జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
నీకేమో అందమెక్కువ లిరికల్ సాంగ్..
వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్ ..
వాల్తేరు వీరయ్య టైటిల్ టీజర్..
బాస్ పార్టీ లిరికల్ వీడియో సాంగ్..