నరేష్ అగస్త్య హీరోగా నటిస్తున్న థ్రిల్లర్ ‘అసురగణ రుద్ర’. సంగీర్తన విపిన్, ఆర్యన్ రాజేష్ కీలక పాత్రధారులు. మురళీ కాట్రగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మురళి కమ్జుల, వంశీ కాంజుల నిర్మాతలు. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ‘నీ మాయలో పడేట్టుగా..’ అంటూ సాగే ఈ సినిమాలోని పాటను మేకర్స్ విడుదల చేశారు.
చైతు సత్సంగి రాసిన ఈ పాటను శేఖర్‌చంద్ర మెలోడియస్గా కంపోజ్ చేయగా రమ్య బెహరా, సిద్ధార్థ్ మీనన్ కలిసి ఆలపించారు. కొత్తగా పెళ్లయిన జంట ప్రేమను సెలబ్రేట్ చేసేలా ఈ పాట సాగింది. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది. మురళీశర్మ, శత్రు, రవివర్మ, శుభలేఖ సుధాకర్, ఆమని తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అమర్నాథ్ బొమ్మిరెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, నిర్మాణం: కమ్జుల ప్రొడక్షన్స్.