Gandeevadhari Arjuna | టాలీవుడ్ యువ హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం గాండీవధారి అర్జున. VT 12 ప్రాజెక్ట్‌గా వస్తోన్న ఈ చిత్రంలో ఏజెంట్ ఫేం సాక్షి వైద్య (Sakshi Vaidya) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రానికి ది ఘోస్ట్ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ నీ జతై లిరికల్ వీడియో సాంగ్ (Nee Jathai Full Lyrical Video Song)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ అందమైన మెలోడీ ట్రాక్‌ను మిక్కీ జే మేయర్ కంపోజిషన్‌లో Elvya , Nakul Abhyankar పాడారు.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేయగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీంతోపాటు టీజర్లో వచ్చే స్టైలిష్ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ విజువల్స్ సినిమాకు హైలెట్‌గా నిలువబోతున్నాయని కూడా అందరినీ ఇంప్రెస్ చేస్తోంది. గాండీవధారి అర్జున మూవీని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
గాండీవధారి అర్జున ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. వరుణ్ తేజ్ దీంతోపాటు VT13లో కూడా నటిస్తున్నాడు. వార్ డ్రామా నేపథ్యంలో పాన్ ఇండియా కథాంశంతో వస్తోన్న ఈ మూవీకి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ (Manushi Chhillar) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.
నీ జతై మెలోడీ ట్రాక్..
గాండీవధారి అర్జున టీజర్..
Here is the soundtrack to your love story ❤️#NeeJathai Full Lyrical from #GandeevadhariArjuna is out now 😍
– https://t.co/Ze2wXn99Uh@sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer #Elvya @nakulabhyankar @LyricistRahman @BvsnP @SVCCofficial @JungleeMusicSTH pic.twitter.com/b1w6zgYASh
— Varun Tej Konidela (@IAmVarunTej) July 31, 2023