మురళి, శివాని నాయుడు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నీ చిత్రం చూసి’. మహీంద్రా బషీర్ దర్శకత్వంలో ఎంఎంకే క్రియేషన్స్ పతాకంపై మురళి మోహన్ కె నిర్మిస్తున్నారు. ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల హీరో మంచు విష్ణు విడుదల చేశారు. చిత్ర టీజర్ బాగుందన్న ఆయన…చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘కొత్త తరహా ప్రేమ కథతో చిత్రాన్ని రూపొందిస్తున్నాం, యువత మనోభావాలను అద్దం పట్టేలా ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’ అని దర్శకుడు మహీంద్రా బషీర్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం : వినయ్ శశిధర్, సినిమాటోగ్రఫీ : సతీష్ ముదిరాజ్.