అగ్రహీరో బాలకృష్ణ వేగం పెంచారు. గత ఏడాది రెండు సినిమాలను విడుదల చేసి, అభిమానుల్లో ఆనందాన్ని నింపిన బాలకృష్ణ.. అదే పద్దతిని ఇక నుంచి కొనసాగించాలని నిర్ణయించారు. ఈ ఏడాది బాలయ్య నుంచి సినిమా వచ్చే అవకాశం లేదు. అయితే.. వచ్చే ఏడాది మొదలుకొని ఇక ప్రతి ఏడాదీ రెండు సినిమాలు ఉండేట్టు ఆయన ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా మార్చి 5 నుంచి మలినేని గోపీచంద్ సినిమా షూటింగ్‌ని షురూ చేశారాయన. ఈలోపు సమయం దొరికినప్పుడల్లా కథలు వింటున్నారు. మలయాళ చిత్రం ‘మార్కో’తో తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్న దర్శకుడు అనీఫ్ అడేని కథను త్వరలో బాలకృష్ణ వినబోతున్నారు.
అన్నీ కుదిరితే దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. మరోవైపు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కూడా బాలకృష్ణ కోసం ఓ కథను రెడీ చేశారట. త్వరలో ఆ కథను కూడా ఆయన వినబోతున్నారట. అలాగే ఈ లిస్ట్‌లో అగ్ర దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నట్టు తెలిసింది. ఇక ‘ఆదిత్య 999’ ఎలాగూ ఉంది. మలినేని గోపీచంద్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యేలా ముందుగానే ప్రణాళిక రచించినట్టు తెలిసింది. మరి ఈ సినిమా తర్వాత పై వాటిలో ఏ సినిమా సెట్స్‌కి వెళ్తుందో తెలియాంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.