Balakrishna Next Movie | నటసింహాం నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసు దాటిన బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సినిమాలు చేస్తూ చెలిరేగిపోతున్నాడు. మాస్ కు కేరాప్ అడ్రస్ అయిన బాలయ్య ఏజ్ పెరుగున్నా కొద్ది మరింత మాస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య అనీల్ రావిపూడితో ‘భగవంత్ కేసరి’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా దసరాను టార్గెన్ చేసుకుని వస్తుంది. ఇక నేడు విడుదలైన టీజర్ కు తిరుగలేని రెస్పాన్స్ వచ్చింది. నందమూరి అభిమానులైతే ఫుల్ జోష్ లో ఉన్నారు. కాగా ఫ్యాన్స్ జోష్ ను రెట్టింపు చేసేందుకు బాలయ్య కొత్త సినిమా అప్డేట్ ను కూడా మేకర్స్ ప్రకటించారు. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య బాబి కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా ప్రీ పోస్టర్ రిలీజైంది. ప్రపంచానికి ఆయన తెలుసు.. కానీ ఎవరకీ ఆయన ప్రపంచం తెలియదు అంటూ ఓ కోట్ తో తెరిచి ఉన్న ఇనుప పెట్టె పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ సూట్ కేసులో మందు బాటిల్, బీడి కట్టా, వేట కత్తి, గొడ్డలి, సుత్తే వంటి పలు ఆయుధాలు ఉన్నాయి. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ అవతారంలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ఒక్క ప్రీ లుక్ పోస్టర్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేసింది చిత్రబృందం. సితార స్టూడీయోస్, శ్రీకర స్టూడీయోస్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని ఓ స్టూడీయోలో ఘనంగా జరిగాయి. బాలకృష్ణ, త్రివిక్రమ్, నాగవంశీ, బాబీ పలువురు సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో సందడి చేశారు.
𝑽𝑰𝑶𝑳𝑬𝑵𝑪𝑬 𝒌𝒂 𝑽𝑰𝑺𝑰𝑻𝑰𝑵𝑮 𝑪𝑨𝑹𝑫… #NBK109 Arriving Early 2024! 😎🔥
Wishing our Natasimham #NandamuriBalakrishna garu a very Happy Birthday! ❤️
A @dirbobby film! 🎬
Produced by @Vamsi84 & #SaiSoujanya #HappyBirthdayNBK @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/4a4LrqEKFA
— Sithara Entertainments (@SitharaEnts) June 10, 2023