NBK108 Movie | ఇప్పుడున్న సీనియర్ హీరోలలో బాలకృష్ణదే హవా నడుస్తుంది. ‘అఖండ’ వంటి భారీ విజయం తర్వాత ‘వీరసింహా రెడ్డి’తో మరో విజయం సాధించాడు. రిలీజ్ రోజున డివైడ్ టాక్ తెచ్చుకున్నా.. టాక్‌తో సంబంధంలేకుండా కలెక్షన్ల వరద పారింది. ప్రస్తుతం బాలయ్య హ్యట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇక బాలయ్య ప్రస్తుతం అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమాగా కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కాగా తాజాగా ఈ సినిమాలోని ఓ పాట సెట్ కోసమే మేకర్స్ కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది. రామోజీఫిలిం సిటీలో దాదాపు 5 కోట్లతో ఓ భారీ సెట్‌ను రూపొందించారట. వినాయకుడికి సంబంధించిన ఓ పాట కోసం ఈ సెట్‌ను నిర్మించారట. ఈ పాటలో బాలయ్య, శ్రీలీల ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేయనున్నారట.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య 45 సంవత్సరాలున్న తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. ‘పెళ్లిసందD’ ఫేం శ్రీలీల బాలయ్య కూతురుగా నటించనుంది. ఈ సినిమా మొత్తం ఫాదర్-డాటర్ ఎమోషన్‌తో సాగుతుందని అనీల్ ఓ సందర్భంలో తెలిపాడు. ఇక బాలకృష్ణకు జోడీగా కాజల్ నటించనుందని టాక్. షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.