NBK 112 | రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్య-కొరటాల సినిమా.. మాస్ అవతార్‌లో నందమూరి హీరో!
NBK 112 | దర్శకుడు కొరటాల శివ సినిమాల గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన ఎంచుకునే బలమైన కథా నేపథ్యాలే. ‘మిర్చి’ నుంచి ‘దేవర’ వరకు ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రంలోనూ ఒక ప్రత్యేకమైన సామాజిక, భౌగోళిక లేదా ప్రాంతీయ నేపథ్యం కనిపిస్తుంది. ఆ ప్రాంత ప్రజల జీవన విధానం, సమస్యలు, భావోద్వేగాలను కథలో భాగంగా మలచడం కొరటాల ప్రత్యేకతగా చెప్పవచ్చు
NBK 112 | దర్శకుడు కొరటాల శివ సినిమాల గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకు వచ్చేది ఆయన ఎంచుకునే బలమైన కథా నేపథ్యాలే. ‘మిర్చి’ నుంచి ‘దేవర’ వరకు ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రంలోనూ ఒక ప్రత్యేకమైన సామాజిక, భౌగోళిక లేదా ప్రాంతీయ నేపథ్యం కనిపిస్తుంది. ఆ ప్రాంత ప్రజల జీవన విధానం, సమస్యలు, భావోద్వేగాలను కథలో భాగంగా మలచడం కొరటాల ప్రత్యేకతగా చెప్పవచ్చు.ఇప్పుడు నందమూరి బాలకృష్ణతో కొరటాల శివ చేయబోతున్న కొత్త ప్రాజెక్ట్‌పై కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఈ కాంబినేషన్లో సినిమా వస్తోందనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో బాలకృష్ణ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారని ప్రచారం జరుగుతుండటంతో సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలకృష్ణకు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన అనేక చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి అదే ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కథను రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకంగా రాయలసీమలోని నీటి సమస్య, అక్కడి ప్రజల జీవన పరిస్థితులు, సామాజిక అంశాలను కథలో ప్రధానంగా చూపించనున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొరటాల శివ సినిమాల్లో కనిపించే బలమైన సామాజిక అంశాలకు ఇది కూడా కొనసాగింపుగా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ ఆగస్టు నెలలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలుస్తోంది.
మరోవైపు, ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్రకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కథలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో బాలయ్య పాత్ర మాఫియా నేపథ్యంతో ఉండబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రలో ఆయనను పూర్తిస్థాయి మాస్ అవతార్‌లో చూపించేందుకు కొరటాల ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు టాక్. యాక్షన్‌తో పాటు ఈ సినిమాలో కుటుంబ భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేయనున్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, మాస్ ఎలిమెంట్స్, సామాజిక అంశాలు కలిసి ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టేలా కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ‘దేవర’ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కథ, పాత్రలు, నేపథ్యం విషయంలో ఆయన చాలా కసరత్తు చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kona Venkat | అలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీకి క్రిమినల్స్.. హాట్ టాపిక్‌గా కోన వెంకట్ కామెంట్స్
Mukhara (K) | కేసీఆర్ సార్ పాలనలో బతుకంతా పచ్చగుండె: ముఖరా (కె) మహిళలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

